Hi,

As of now we don't have any separate list like fuel-telugu-discuss. So we can post our
translations (suggestions) to fuel-discuss directly for discussion. Later we can evaluate
the final translations from the posts. As well as we can update at (https://fedorahosted.org/fuel/wiki/fuel-telugu).

Thanks & Regards
Krishna Krothapalli.

2008/8/30 Veeven (వీవెన్) <veeven@gmail.com>
ఫ్యూయల్ ప్రాజెక్టు (https://fedorahosted.org/fuel/wiki/fuel-telugu)
లోని తెలుగు అనువాదాలను చూసాను. కొన్నింటిపై నా సూచనలు.

(ఇలాంటి చర్చలకు  తెలుగుకై ప్రత్యేకంగా fuel-telugu-discuss అన్న
లిస్టుని సృష్టిస్తారా? లేక fuel-discussలో చేయవచ్చా? నా సందేశం తెలుగులో
ఉన్నందున fuel-discussకి పంపించలేదు.)

క్రింది ప్రతీ అంశం మొదటి లైను fuel-telugu.po నుండి. రెండవ లైనులో నా
వ్యాఖ్య/సూచన/విమర్శ

* Accessibility         అందుబాటు
  అందుబాటు అన్నది availabilityని సూచిస్తుంది. కానీ ఇంతకంటే మంచి పదం
నాకు తోచలేదు.

* Administration        నిర్వాహకుడు
  "నిర్వహణ" అన్నది సరైనది.

* Alignment     లీనము
  లీనము అన్నది కలిసిపోయిన (absorbed into) అన్న అర్థాన్ని సూచిస్తుంది.
కానీ ఓ వరుసలో ఉంచడమనే అర్థాన్ని స్ఫురింపజేయట్లేదు.

* Applications  అనువర్తనాలు
  "ఉపకరణాలు" అన్నది మెరుగైన అనువాదంగా అనిపిస్తుంది.

* Bookmark      పుస్తకగుర్తు
  బ్లాగు లోకంలో "పేజీక" అని ఓ కొత్త పదం వాడుతున్నాం. చర్చ:
http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/e21c1e5dd1d46eb5

* Chart పత్రం
  పత్రం అన్నది ఛార్ట్ అన్న అర్థాన్ని సూచించదు. ఛార్టు అని వాడితే మేలు.

* Consolidate   ఒకటిగాచేర్చు
   "సమీకరించు" అన్నది సరిపోవచ్చు.

* Extensions    విస్తరింపులు
  "పొడగింపులు" అని బ్లాగ్లోకంలో విరివిగా వాడుతున్నాం.

* Footnotes     సూచీభూమికలు
  "పాద సూచికలు" అన్నది మెరుగుగా అనిపిస్తుంది.

* Internet      మహాతలం
  "అంతర్జాలం" అని విరివిగా వాడుతున్నాం. (ఈనాడులో కూడా వాడాడు.)

* Layout        నమూన
  "అమరిక" అన్నది సరైనది. నమూనా అన్నది sampleకి సరిపోలినది.

* Line  వరుస
  పంక్తి అన్నది కాస్త గ్రాంధీకమవుతుందేమో.

* Links జోడులు
  "లింకులు" లేదా "లంకెలు" అని వాడవచ్చు. జోడింపు అన్నది attachmentకి సరిపోతుంది.

* Macros        స్థూలములు
  No way. మరింత సరైన పదం వెతకాలి.

* Month మాసము
  "నెల" అన్నది ఎక్కువగా వాడుకలో ఉంది.

* Mouse మౌస్
  "మూషికం" అని వాడవచ్చు.

* Names నామాలు
  సులువుగా ఉండే "పేర్లు" అని వాడవచ్చు.

* Note  సూచన
  "గమనిక" అన్నది బాగుంటుందేమో.

* Object        తాత్పర్యము
  "వస్తువు"

* Options       ఇచ్ఛాపూర్వకాలు
  "ఎంపికలు" లేదా "ఐచ్ఛికాలు" అన్నవి సరళంగా ఉన్నాయి.

* Page  పుట
  "పేజీ" అనే వాడవచ్చు.

* Password      అనుమతిపదం
  "సంకేతపదం" అని మీడియావికీ, వర్డుప్రెస్ లాంటి వాటిల్లో వాడాము.

* Personal      స్వకీయమైన
  "వ్యక్తిగత" అన్నది మరింత దగ్గర పదం.

* Picture       తాత్పర్యము
  "బొమ్మ" లేదా "చిత్రం" అన్నది సరిపోతుంది.

* Points        స్థానములు
  "బిందువులు" అన్నది మెరుగ్గా తోస్తుంది.

* preview       ఉపదర్శనం
  "మునుజూపు" అని మీడియావికీలోనూ, ఇతరచోట్లా వాడాము.

* Print         ముద్రణ
  "ముద్రించు"

* Privacy       రహస్యము
  "అంతరంగికత" లేదా "గోప్యత" అన్నవి సరిపోతాయి.

* Profiles      అర్ధముఖాలు
  "ప్రవర" అన్నది సరైనది కానీ అందరికీ తెలియకపోవచ్చు.

* Rename        పనర్నామకరణ
  "పేరుమార్చు" అన్నది సరిపోతుంది.

* Sessions      భాగాలు
  No way.

* Support       సహకారం
  "తోడ్పాటు" అన్నది సరిపోతుంది. సహకారం అన్నది cooperation.

* Text  పాఠము
  "పాఠ్యం" అన్నది సరైనది. పాఠం is for lesson.

* Themes        ధాతువులు
  "అలంకారాలు" అన్నది సరైనది.

* Versions      వివరణలు
  "సంచికలు" అన్నది సరిపోవచ్చు.

* Window        గవాక్షము
  "కిటికీ" అన్న తేలికైన పదం వాడండి.

* Advanced Search       వృద్దియైన శోధన
  "నిశితమైన అన్వేషణ" అన్నది సరిపోతుంది.

* Help Contents సహాయ సారములు
  "సహాయపు విషయాలు"

* Login Screen  లాగిన్ తెర
  "ప్రవేశపు తెర"

* Firefox Web Bowser
  "వెబ్ విహారిణి" అని వాడండి.

* Users and Groups      వినియోగదారులు మరియు సమూహాలు
  "వాడుకర్లు మరియు సమాహాలు". Userకి సమానార్థకంగా "వాడుకరి" అని
వాడుతున్నాం. మరిన్ని: http://telugupadam.org/User

నెనర్లు,
వీవెన్.