Hi,
As of now we don't have any separate list like fuel-telugu-discuss. So we can post our translations (suggestions) to fuel-discuss directly for discussion. Later we can evaluate the final translations from the posts. As well as we can update at ( https://fedorahosted.org/fuel/wiki/fuel-telugu).
Thanks & Regards Krishna Krothapalli.
2008/8/30 Veeven (వీవెన్) veeven@gmail.com
ఫ్యూయల్ ప్రాజెక్టు (https://fedorahosted.org/fuel/wiki/fuel-telugu) లోని తెలుగు అనువాదాలను చూసాను. కొన్నింటిపై నా సూచనలు.
(ఇలాంటి చర్చలకు తెలుగుకై ప్రత్యేకంగా fuel-telugu-discuss అన్న లిస్టుని సృష్టిస్తారా? లేక fuel-discussలో చేయవచ్చా? నా సందేశం తెలుగులో ఉన్నందున fuel-discussకి పంపించలేదు.)
క్రింది ప్రతీ అంశం మొదటి లైను fuel-telugu.po నుండి. రెండవ లైనులో నా వ్యాఖ్య/సూచన/విమర్శ
- Accessibility అందుబాటు అందుబాటు అన్నది availabilityని సూచిస్తుంది. కానీ ఇంతకంటే మంచి పదం
నాకు తోచలేదు.
Administration నిర్వాహకుడు "నిర్వహణ" అన్నది సరైనది.
Alignment లీనము లీనము అన్నది కలిసిపోయిన (absorbed into) అన్న అర్థాన్ని సూచిస్తుంది.
కానీ ఓ వరుసలో ఉంచడమనే అర్థాన్ని స్ఫురింపజేయట్లేదు.
Applications అనువర్తనాలు "ఉపకరణాలు" అన్నది మెరుగైన అనువాదంగా అనిపిస్తుంది.
Bookmark పుస్తకగుర్తు బ్లాగు లోకంలో "పేజీక" అని ఓ కొత్త పదం వాడుతున్నాం. చర్చ:
http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/e21c1e5dd1d4...
Chart పత్రం పత్రం అన్నది ఛార్ట్ అన్న అర్థాన్ని సూచించదు. ఛార్టు అని వాడితే మేలు.
Consolidate ఒకటిగాచేర్చు "సమీకరించు" అన్నది సరిపోవచ్చు.
Extensions విస్తరింపులు "పొడగింపులు" అని బ్లాగ్లోకంలో విరివిగా వాడుతున్నాం.
Footnotes సూచీభూమికలు "పాద సూచికలు" అన్నది మెరుగుగా అనిపిస్తుంది.
Internet మహాతలం "అంతర్జాలం" అని విరివిగా వాడుతున్నాం. (ఈనాడులో కూడా వాడాడు.)
Layout నమూన "అమరిక" అన్నది సరైనది. నమూనా అన్నది sampleకి సరిపోలినది.
Line వరుస పంక్తి అన్నది కాస్త గ్రాంధీకమవుతుందేమో.
Links జోడులు "లింకులు" లేదా "లంకెలు" అని వాడవచ్చు. జోడింపు అన్నది attachmentకి
సరిపోతుంది.
Macros స్థూలములు No way. మరింత సరైన పదం వెతకాలి.
Month మాసము "నెల" అన్నది ఎక్కువగా వాడుకలో ఉంది.
Mouse మౌస్ "మూషికం" అని వాడవచ్చు.
Names నామాలు సులువుగా ఉండే "పేర్లు" అని వాడవచ్చు.
Note సూచన "గమనిక" అన్నది బాగుంటుందేమో.
Object తాత్పర్యము "వస్తువు"
Options ఇచ్ఛాపూర్వకాలు "ఎంపికలు" లేదా "ఐచ్ఛికాలు" అన్నవి సరళంగా ఉన్నాయి.
Page పుట "పేజీ" అనే వాడవచ్చు.
Password అనుమతిపదం "సంకేతపదం" అని మీడియావికీ, వర్డుప్రెస్ లాంటి వాటిల్లో వాడాము.
Personal స్వకీయమైన "వ్యక్తిగత" అన్నది మరింత దగ్గర పదం.
Picture తాత్పర్యము "బొమ్మ" లేదా "చిత్రం" అన్నది సరిపోతుంది.
Points స్థానములు "బిందువులు" అన్నది మెరుగ్గా తోస్తుంది.
preview ఉపదర్శనం "మునుజూపు" అని మీడియావికీలోనూ, ఇతరచోట్లా వాడాము.
Print ముద్రణ "ముద్రించు"
Privacy రహస్యము "అంతరంగికత" లేదా "గోప్యత" అన్నవి సరిపోతాయి.
Profiles అర్ధముఖాలు "ప్రవర" అన్నది సరైనది కానీ అందరికీ తెలియకపోవచ్చు.
Rename పనర్నామకరణ "పేరుమార్చు" అన్నది సరిపోతుంది.
Sessions భాగాలు No way.
Support సహకారం "తోడ్పాటు" అన్నది సరిపోతుంది. సహకారం అన్నది cooperation.
Text పాఠము "పాఠ్యం" అన్నది సరైనది. పాఠం is for lesson.
Themes ధాతువులు "అలంకారాలు" అన్నది సరైనది.
Versions వివరణలు "సంచికలు" అన్నది సరిపోవచ్చు.
Window గవాక్షము "కిటికీ" అన్న తేలికైన పదం వాడండి.
Advanced Search వృద్దియైన శోధన "నిశితమైన అన్వేషణ" అన్నది సరిపోతుంది.
Help Contents సహాయ సారములు "సహాయపు విషయాలు"
Login Screen లాగిన్ తెర "ప్రవేశపు తెర"
Firefox Web Bowser "వెబ్ విహారిణి" అని వాడండి.
Users and Groups వినియోగదారులు మరియు సమూహాలు "వాడుకర్లు మరియు సమాహాలు". Userకి సమానార్థకంగా "వాడుకరి" అని
వాడుతున్నాం. మరిన్ని: http://telugupadam.org/User
నెనర్లు, వీవెన్. https://lists.sourceforge.net/lists/listinfo/indlinux-telugu